మెదక్ రూరల్ జూలై 30 : సన్న బియ్యం, నూతన రేషన్ కార్డుల ద్వారా ఆహార భద్రత లభిస్తుందని
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. బుధవారం హవేలీ ఘన్పూర్ మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. ముందుగా మెదక్ ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ సింధు రేణుక, ప్రజా ప్రతినిధులుతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని రేషన్ కార్డులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులలో భాగంగా అర్హులైన ప్రతి వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
తదనుగుణంగా ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశాన్నారు. అనంతరం కలెక్టర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పిల్లల సామర్థ్యాలు, నిర్వహణ తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పశు వైద్యశాలను ఆయన తనిఖీ చేశారు. పశువైద్యశాలలో డాక్టర్లు అందుబాటులో ఉండాలని, కాలానుగుణంగా పశువులకు వచ్చే వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండి వ్యాక్సినేషన్ అందించాలని సూచించారు.