మెదక్ రూరల్ అక్టోబర్ 24 : వైద్యులు సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యులకు సూచించారు. శుక్రవారం హవేలీ ఘనపూర్ మండలంలోని సర్దన గ్రామంలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజస్టర్స్, మందులను పరిశీలించారు. రోగులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ వైద్యులందరూ తప్పకుండా సమయపాలన పాటించాలన్నారు. పేదలందరికీ ఉచిత నాణ్యమైన వైద్యం అందాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.