మెదక్ రూరల్,అక్టోబర్ 03 : బ్రిడ్జి రోడ్డు మరమ్మతు పనులు పూర్తి చేయాలి అని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ నుండి ముక్త భూపతిపూర్ వెళ్లే తాత్కాలిక బ్రిడ్జి రోడ్డు నిర్మాణాన్ని, మహిళా శక్తి భవనం నిర్మాణ పనులు శుక్రవారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
వర్షాలు వరదలు తాకిడికి గతంలో మెదక్ ముక్త భూపతిపూర్ బ్రిడ్జి భారీగా దెబ్బతిన్న దానిని తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం జరిగిందని వాటిని పరిశీలించి పనులు తొందరగా పూర్తి చేయాలని ఆదేశించామని చెప్పారు. అలాగే మహిళా శక్తి భవనం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించామని వివరించారు.