Collector Rahul Raj | మెదక్, మార్చి 20 : మెదక్ జిల్లాలో మోడల్ కామన్ సర్వీస్ సెంటర్స్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఇవాళ కలెక్టరేట్ కార్యాలయంలో కామన్ సర్వీస్ సెంటర్స్ ప్రాజెక్ట్ బ్రోచర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో మారుమూల గ్రామాల్లో డిజిటల్ సేవలతోపాటు బ్యాంకింగ్ ఆధార్ సేవలను అనుసంధానిస్తూ 100 నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం పథకం, ఇతర ప్రభుత్వ సబ్సిడీ పథకాల కింద 60-80 శాతం సబ్సిడీతో ఉపాధి అవకాశం కల్పించడంతోపాటు మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ.. మహిళ సంఘాల్లో ఆర్థికంగా చేయూతనిస్తూ.. ఉపాధి కల్పించే లక్ష్యంతో మహిళ శక్తి కింద యూనిట్లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలతోపాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడానికి ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ బేతోజు హరికృష్ణ కుమార్, జిల్లా మేనేజర్ అముదాల రాజు, అధికారులు పాల్గొన్నారు.
Vishnupriya | బెట్టింగ్ యాప్ కేసు.. విష్ణుప్రియ ఫోన్ని సీజ్ చేసిన పంజాగుట్ట పోలీసులు