సిద్దిపేట కలెక్టరేట్, సెప్టెంబర్ 9: అర్జీదారులకు న్యాయం చేయడం మన కర్తవ్యమని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగం గా అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, గరిమాఅగర్వాల్తో కలిసి అర్జీదారుల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యలను నేరుగా విన్నవించి పరిష్కరించుకోవడానికి అర్జీదారులు ఎంతో ఆశతో కలెక్టరేట్‌కు వస్తారని, వారందరికీ న్యాయం చేయడం మన కర్తవ్యమని తెలిపారు.
అర్జీదారులకు ప్రజావాణిపై నమ్మ కం పెరిగిందని, క్రమక్రమంగా అర్జీదారుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు ఎంతో ఉత్సాహంతో పని చేయాలన్నారు. భూ సంబంధిత, రెండు పడకగదుల ఇండ్లు, ఆసరా పింఛన్లు, ఇతరత్రా కలిపి 33 దరఖాస్తులు అందాయన్నారు. డీఆర్వో నాగరాజమ్మ, అధికారులు పాల్గొన్నారు.