కొండపాక(కుకునూరుపల్లి), నవంబర్ 30: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి ఆదేశించారు. శనివారం కొండపాక మండల కేంద్రంలోని రాజీవ్ రహదారి పక్కనున్న మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కిచెన్ షెడ్, కూరగాయలు, బియ్యం, పప్పులు, ఇతర సామగ్రిని పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లో మెనూ ప్రకారం వంటలు చేయాలన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సూచించారు. సాయంత్రం స్నాక్స్‌లో భాగంగా అటుకులను రుచి చూశారు. వంట విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయవద్దని సిబ్బందిని హెచ్చరించారు.