హుస్నాబాద్‌టౌన్, జూన్ 19: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్‌తోపాటు ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ విభాగాల్లో పనుల నిర్వహణ తీరుపై సిద్దిపేట కలెక్టర్ హైమావతి అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్‌కార్యాలయంలో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్డబ్ల్యూఎస్శాఖల పనులపై గురువారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన పనులప్రగతి వివరాలు సరిగ్గా లేవని ఏఈ మహేశ్‌ను ప్రశ్నించారు. మంజూరైన నిధులతో ఎంతపనిజరిగిందనే వివరాలు లేకుండా కేవలం ఫ్రోగెస్ అని ఇవ్వడం ఏమిటని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రతివార్డుకు కేటాయించిన పనుల వివరాలన్నీ ఇలా ఉండటం ఏమిటని, తప్పకుండా పనులకు సంబంధించి స్పష్టత ఉండాలని, త్వరలోనే మరోసారి సమీక్ష చేస్తానని కలెక్టర్ స్పష్టం చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టుపై సమీక్ష సందర్భంగా రిజర్వాయర్ 90శాతం పూర్తికావడం జరిగిందని, ఎన్జీటీ కేసు వల్ల ఆగిపోయిందని ఇరిగేషన్‌శాఖ ఈఈ రాములు, అధికారులు కలెక్టర్‌కు వివరించారు. 45ఎకరాలకు పరిహారం ఇవ్వాలని, ట్రయల్ రన్చేసేందుకు నిబంధనల ప్రకారం భూముల పరిహారం బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగిందని తెలిపారు. హుస్నాబాద్ నుంచి రామవరం వరకు శంకుస్థాపన చేసిన పనులు ఎందుకు ప్రారంభం కాలేదో చెప్పాలని, దీనిపై రోజువారి ప్రగతి నివేదిక ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
హుస్నాబాద్, కోహెడ తదితర మండలాల్లో పలు రహదారుల పనులకు సంబంధించి కాంట్రాక్ట్ పనులను లక్కీఏజెన్సీ దక్కించుకున్నప్పటికీ పనులు జరగడంలేదనే విషయాన్ని కలెక్టర్ హైమావతి సమీక్షలో గుర్తించారు. ఈ సందర్భంగా దాదాపు తొమ్మిది పనులను లక్కీ ఏజెన్సీకి రావడం జరిగిందని, అన్ని పనులు ప్రారంభంకాలేదని పీఆర్‌డీఈఈ మహేశ్ వివరించగా వారికి లక్కీ ఉందికానీ మనం ఆన్లక్కీ అని అన్నారు. జిల్లాలో హెల్త్ సబ్‌సెంటర్లు, పంచాయతీ భవనాలు ఈజీఎస్‌లో కట్టేందుకు ముందుకురావడంలేదని కలెక్టర్ ఆరాతీశారు. దీనిపై పీఆర్‌ఈఈ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఆరేండ్లక్రితం అంచనాలతో తయారుచేసిన ధరలు నేటికి ఉండటంతో పనుల నిర్వహణ చేయలేని పరిస్థితి ఉందని కలెక్టర్‌కు వివరించారు.
అంతకుముందు జిల్లాపరిషత్ బాలికల ఉన్నతపాఠశాలను కలెక్టర్ తనిఖీచేసి విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖానను తనిఖీచేసి వివిధ విభాగాలను పరిశీలించారు. కొందరు సిబ్బంది గైర్హాజరు కావడంపై కలెక్టర్హైమావతి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక ఎల్లమ్మచెరువుసుందరీకరణ పనులను కలెక్టర్ పరిశీలించారు. హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖానకు మంజూరైన బ్లడ్‌బ్యాంక్‌కు సిబ్బందిని కేటాయించాలని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లింగమూర్తి కలెక్టర్‌ను కోరారు. సమీక్షలో హుస్నాబాద్ ఆర్డీవో రామమూర్తి, ఆర్అండ్బీడీఈఈ నరేందర్, హుస్నాబాద్ దవాఖాన సూపరింటెండెంట్ రమేశ్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్‌గౌడ్ పాల్గొన్నారు.