Medak : మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో వదం శాతం ఓటింగ్‌కు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్(Collecter Rahul Raj) అన్నారు. మొదటి విడత పోలింగ్ శాతంలో రాష్ట్ర స్థాయిలో మెదక్ జిల్లా 88.56తో 5వ స్థానంలో నిలిచిందని.. రెండో విడత 88.80 శాతం నమోదైందని కలెక్టర్ తెలిపారు. మూడో విడత పోలింగ్‌లో మెదక్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని రాహుల్ రాజ్ ఓటర్లను కోరారు. డిసెంబర్ 17 వ తేదీన మూడవ విడత ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
మొదటి, రెండోవిడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాం. అలానే మూడో విడత ఎన్నికల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయముగా పని చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మూడో విడత ఎన్నికలు జరిగే నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కొల్చారం శివంపేట్, వెల్దుర్తి, మాసాయిపేట్ మండలాల్లోని ప్రజలంతా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.