జహీరాబాద్, జూన్ 15: అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందిన పేదలకు సీఎం సహాయ నిధి ఎంతో భరోసానిస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. ఆదివారం జహీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రంజోల్కు చెందిన చంద్రకళకు రూ. 52,500, నాగమ్మకు రూ.24 వేలు, డేవిడ్‌రాజ్‌కు రూ. 23వేలు, దత్తగిరి కాలనీకి చెంది న పర్వీన్‌కు రూ.60 వేలు, రమాకాంత్‌కు రూ.54వేలు, బాగారెడ్డిపల్లికి చెందిన మొగులయ్యకు రూ.15వేలు, చిన్న హైదరాబాద్‌కు చెందిన శ్యామ్సుందర్కు రూ.60 వేల చొప్పున సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు.
అనంతరం మొగుడంపల్లి మండలంలోని సత్వార్కు చెందిన మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు మాణిక్‌రెడ్డిని పరామర్శించి, ఆరో గ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. న్యాల్కల్ మండలంలోని చాల్కి చౌరస్తాలో కొత్తగా ఏర్పాటు చేసిన డ్యాన్ని ఫిల్లింగ్ స్టేషన్(పెట్రోల్ బంక్)ను ప్రారంభించారు. కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ మచ్ఛేందర్, ఆయా మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు తట్టు నారాయణ, రవీందర్, వెంకటేశం, పార్టీ నాయకులు నామరవికిరణ్, నర్సింహారెడ్డి, స్వప్నభాస్కర్, మోహన్‌రెడ్డి, సత్యం ముదిరాజ్, యాకూబ్, చిన్నారెడ్డి, అమిథ్రాజ్, సయీద్, విజయ్‌రాథోడ్, శ్రీకాంత్‌రెడ్డి, చంద్రన్న, సుధాకర్‌రెడ్డి, ఉమేశ్ పాటిల్ పాల్గొన్నారు.