వెల్దుర్తి, మే1. వైద్య ఖర్చులు భరించలేని నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతాపూర్తండాకు చెందిన బానోతు సునీతకు రూ. 60 వేల సీఎం సహాయనిధి నుంచి మంజూరు కాగా గురువారం నర్సాపూర్లోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వారి కుటుంబసభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగానికి గురై వైద్యం చేయించే స్థోమత లేని ఎంతోమంది పేదలు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం పొంది ఆరోగ్యంగా జీవిస్తున్నారన్నారు. కార్యక్రమంలో నాయకుడు శ్రీనునాయక్ తదితరులు పాల్గొన్నారు.