సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
పేదలకు సీఎంఆర్ఎఫ్ అండగా ఉందని హ్యండ్లూమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం కొండాపూర్ మండల కేంద్రంతో పాటు సీహె.చ్ కోనాపూర్, కొండాపూర్, గుంతపల్లి, తొగర్పల్లి, శివన్నగూడెం, తేర్పొల్ గ్రామాలకు చెందిన 14 మంది లబ్ధిదారులకు రూ.5.26 లక్షల చెక్కులు అందజేశారు.
- రాష్ట్ర హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్
కొండాపూర్, జనవరి12: పేదలకు సీఎంఆర్ఎఫ్ అండగా ఉందని హ్యండ్లూమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం కొండాపూర్ మండల కేంద్రంతో పాటు సీహె.చ్ కోనాపూర్, కొండాపూర్, గుంతపల్లి, తొగర్పల్లి, శివన్నగూడెం, తేర్పొల్ గ్రామాలకు చెందిన 14 మంది లబ్ధిదారులకు రూ.5.26 లక్షల చెక్కులు అందజేశారు. ముఖ్యంత్రి సహాయ నిధి నుంచి రాష్ట్రంలో సంగారెడ్డి నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చానన్నారు. కొండాపూర్ మండలానికి పెద్ద ఎత్తున నిధులను అందించిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పద్మావతి పాండురంగం, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు రుక్ముద్దీన్, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మ్యాకం విఠల్, సర్పంచ్ ప్రకాశం, మాజీ సర్పంచ్‌లు, బీఆర్ఎస్ నాయకులు జగదీశ్వర్, సత్యానందం, శ్యాంరావు, నాగయ్య, రవి, శేఖర్, మోహన్‌గౌడ్, సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు.
సదాశివపేటలో..
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో సదాశివపేట మండలంలో 15 మంది, పట్టణానికి సంబధించిన 17 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు ఆరోగ్యంగా ఉండడమే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎంఆర్ఎఫ్ వరంలా మారిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ యాదమ్మ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సుధీర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్ద గొల్ల ఆంజనేయులు, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు నవీన్, సర్పంచ్‌లు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

