రామాయంపేట, ఆగస్టు 16: మెదక్ జిల్లా కేంద్రంలో జరిగే సీఎం కేసీఆర్ సభను కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లి సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి రాధాకృష్ణశర్మ పేర్కొన్నారు. బుధవారం రామాయంపేట పట్టణంలోని శారదా బంకెట్హాల్లో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డితో కలిసి ఉమ్మడి రామాయంపేట, నిజాంపేట మండలాల ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ రాబోయేది ఎన్నికల సీజన్ అందరూ కలిసికట్టుగా ఉండి మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యకర్తలు ఎలాంటి మనోభావాలకు గురికావద్దని, ఏదైనా లోపాలు ఉంటే నేరుగా పరిశీలకులకు చెప్పాలన్నారు.
మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే పనితనం ప్రతిఒక్కరికీ తెలుసని, పట్టుబట్టి మరీ నియోజకవర్గానికి కోట్లాది నిధులు తీసుకొచ్చారన్నారు. మెదక్ జిల్లా కేంద్రంగా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుతో ఒప్పించగలిగారని గుర్తు చేశారు. నాడు అభివృద్ధి అంటే ఎరుగని వారు నేడు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఉచిత వాగ్దానాలను ఇస్తున్నారన్నారు. వాటిని ప్రజలు ఎవ్వరూ కూడా నమ్మే స్థితిలో లేరన్నారు. తెలంగాణ రైతులకు మూడు గంటల విద్యుత్ చాలన్న కాంగ్రెస్ నాయకులకు రాబోయే ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ర్టాల్లో తెలంగాణ మొదటిదన్నారు.
కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, పరిశీలకులు శ్రీహరి యాదవ్, కాముని శ్రీనివాస్, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పురపాలిక వైస్ చైర్పర్సన్ పుట్టి విజయలక్ష్మి, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు పుట్టి యాదగిరి, నిజాంపేట, రామాయంపేట ఎంపీపీలు దేశెట్టి సిద్దిరాములు, భిక్షపతి, పార్టీ మండలాల అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, పట్టణాధ్యక్షులు గజవాడ నాగరాజు, చలిమెటి నాగరాజు, సొసైటీల చైర్మన్లు అందె కొండల్‌రెడ్డి, బాపురెడ్డి, బాదె చంద్రం, దేవస్థాన కమిటీ చైర్మన్ ఆకుల మహేశ్, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాతూరి ప్రభావతి, బాలుగౌడ్, బీఆర్ఎస్ నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు నర్సాగౌడ్, అమరసేనారెడ్డి, కొమ్మాట సత్యనారాయణ, స్వామి, చంద్రపు కొండల్‌రెడ్డి, దేవుని రాజు తదితరులున్నారు.