మెదక్ మున్సిపాలిటీ, జనవరి 10: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీదర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీత క్క సురేఖ, జూపల్లి కృష్ణారావులతో కలిసి జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రైతు భరోసా, ఇందిర మ్మ ఇండ్ల పథకాల అమలు.. అర్హుల జాబి తా తయారీపై చర్చించారు. 26న రిప్లబ్లిక్ డేను పురస్కరించుకొని రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పథకాల అమలుపై రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభల నిర్వహణ, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకోవాలని ఆదేశించారు.
సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 10: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశానికి సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణరావుతో కలిసి సీఎం కలెక్టర్లతో సమావేశమయ్యారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు, లబ్ధిదారుల జాబితా తయారీ తదితర అంశాలపై చర్చించారు. ఈనెల 26న రిపబ్లిక్ డే నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. పథకాల అమలుపై గ్రామాల్లో గ్రామసభ, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలన్నారు.