సిద్దిపేట, మార్చి 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ నంగునూరు: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో రూ. 300 కోట్లతో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన టీజీ అయిల్ ఫెడ్ ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ప్రజపాలనలో రైతు ఉత్సవాల్లో భాగంగా వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రీకకరణ పై ఏర్పాటు చేసిన 150 స్టాళ్లను సందర్శించి, నూతనంగా 50 కోట్ల రూపాయలతో ఆయిల్‌పామ్ రిఫైనరి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.
అనంతరం సభావేదిక సమీపంలో సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట మున్సిపాలిటీలో రూ.141.34 కోట్లతో యూఐడీఎఫ్ ఆధ్వర్యంలో నీటి సరఫరా ప్రాజెక్టులు, భూగ ర్భ డ్రైనేజీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సన్పల్లిలో రూ.78 కోట్లతో నిర్మించిన జిల్లా జైలును, సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లిలో రూ.15 కోట్లతో నిర్మించిన 50 పడకల సమీకృత ఆయుష్ దవాఖాన, రూ.3.60 కోట్లతో ఎన్సాన్‌పల్లిలో సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను, నంగునూరు మండలం గట్లమల్యాలలో రూ.1.43 కోట్లతో నూతనంగా నిర్మించిన పీహెచ్సీ భవనాన్ని, సిద్దిపేట పట్టణంలోనీ ఎన్జీవోస్ కాలనీలో రూ.1.43 కోట్లతో నూతనంగా నిర్మించిన యూపీహెస్ భవనాన్ని ప్రారంభించారు.
గజ్వే ల్ నియోజకవర్గంలోని కొండపాక మండల కేంద్రంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మరూక్ మండ ల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ సూల్లో రూ.16.62 కోట్లతో మౌలిక సదుపాయాలు అదనపు భవనాలకు శంకుస్థాపన చేశారు. జగదేవ్‌పూర్‌లో రూ. 9.65 కోట్లతో నిర్మించిన సమీకృత మండల కార్యాలయాల సముదాయం (ఐవోసీ)ని సీఎం రేవంత్ ప్రారంభించారు. అనంతరం సభా వేదికపై రైతుల ఖాతాలో రైతుభరోసా నిధులు విడుదల చేసా రు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం,తాను సిద్దిపేటపై ఎలాంటి వివక్ష చూపడం లేదన్నారు. సిద్దిపేట అభివృద్ధికి అన్ని ప్రాంతాల మాదిరిగా నిధులు ఇస్తున్నట్లు తెలిపారు. రైతులు తప్పనిసరిగా పంట మార్పిడి పాటించాలని కోరారు. ఆ తర్వాత మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్, దామోదర రాజనరసింహ, ఎంపీ రఘునందన్ మాట్లాడారు.
సిద్దిపేట ఎమ్మెల్యేను గెలిపిస్తే మంత్రిని చేస్తా: సీఎం
సిద్దిపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 2029 లో మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ అని, ఎన్నికల్లో సిద్దిపేటలో ఎమ్మెల్యేగా గెలిపించిన వాళ్లను మంత్రిని చేసే బాధ్యత తమ మంత్రులు వివేక్, దామన్నకు అప్పగిస్తున్నాన్నారు. కొన్నేండ్లుగా ఈ ప్రాంతం లో ఒకే కుటుంబం నుంచి ఎమ్మెల్యే ఉంటున్నారని సీఎం అన్నారు. ఇతరులకు ఒక అవకాశం ఇవ్వాలని, మార్పు చేసి చూడండి.. మంచి జరుగుతుందో లేదో చూడండని సీఎం అన్నారు.
మీరు అడ్డుకుంటే ఏదీ ఆగదు, మళ్లీ 2029 లో వస్తాం, సిద్దిపేటలో గెలిపించిన వ్యక్తిని మంత్రిని చేస్తాం, సిద్దిపేటపై ఎలాంటి వివక్ష చూపాల్సిన అవసరం తమకు లేదని సీఎం అన్నారు. ఆయిల్‌పామ్ కంపెనీ ఇకడున్న ఎమ్మెల్యే కోసం కాదు, రైతుల కోసం అని అన్నారు. తాను వివక్ష చూపనని.. తనది వివక్ష చూపే తత్వం కాదని సీఎం న్నారు. తాము పేదల కోసం పని చేస్తాం తప్ప, రాజకీయ నాయకుల కోసం కాదన్నారు. మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమురయ్య, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి, కలెక్టర్ హైమావతి, అధికారులు, రైతులు పాల్గొన్నారు.