మెదక్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ)/మెదక్ రూరల్, ఏప్రిల్ 20: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం మెదక్ జిల్లాకేంద్రానికి వచ్చారు. మెదక్ జిల్ల్లాకేంద్రంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. మధ్యాహ్నం 1:16 గంటలకు హెలికాప్టర్ ద్వారా మెదక్ చర్చి కాంపౌండ్‌కు చేరుకున్నారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆయనకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు .అనంతరం ఎమ్మెల్యే రోహిత్‌రావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ,కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహతో తో కలిసి రాందాస్ చౌరస్తా సభా వేదిక పైకి వచ్చారు. ఆయన 2.05 నుంచి 2.32 గంటల వరకు కార్నర్ రోడ్‌షో ప్రసంగించారు. 2.44కు సభావేదిక నుంచి బయల్దేరారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. ముదిరాజ్ బిడ్డ నీలం మధును గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.