జహీరాబాద్, అక్టోబర్ 27: గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలు చేసి, పోడు పట్టాలు పంపిణీ చేశారని జహీరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్‌రావు తెలిపారు. శుక్రవారం మొగుడంపల్లి మండలంలోని జాడిమాల్కాపూర్, సజ్జారావుపేటతండా, పర్వతాపూర్, జంగర్బౌళితండా, మిర్జాంపల్లితండా, హరిచందర్ నాయక్‌తండాలో ఎమ్మెల్యే, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి దేవీప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఏర్పుల నరోత్తం, టీఎస్ఐడీసీ చైర్మన్ తన్వీరుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం తండాలను గ్రామ పంచాయతీలు చేసి అభివృద్ధి కోసం అధిక నిధులు మంజూరు చేశారన్నారు. ప్రతి గిరిజన తండాల్లో సీసీ రోడ్లు, మురికి కాల్వలు నిర్మాణం చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త పంచాయతీల్లో గ్రామ పంచాయతీ భవనాలు, విద్యార్థుల కోసం పాఠశాల భవనాలు నిర్మాణం చేసిందన్నారు. ప్రతి గిరిజన తండాను ఆదర్శంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారన్నారు. తండాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు నిధులు మంజూరు చేశారన్నారు. పోడు భూముల్లో పంటలు సాగు చేసుకుంటున్న రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేసి హక్కులు కలిపించారన్నారు. ప్రతి ఇంటికీ మిషన్ భగరీథ నీరు సరఫరా చేశారన్నారు. బీఆర్ఎస్ స్థానిక వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని, శాసనసభ ఎన్నికల్లో ఓట్లు వేసి ఆశీర్వదించాలని కోరారు. సజ్జారావుపేటతండాలో సర్పంచ్, టెలికం బోర్డు సభ్యులు పవార్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, పూల వర్షం కురిపించారు. గిరిజన మహిళలు తండాల్లో గిరిజన సంప్రదాయంతో స్వాగతం పలికారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు విజయ్‌మోహన్‌రెడ్డి, కుద్భొద్దీన్, శ్రీనివాస్‌రెడ్డి, విజయ్‌కుమార్, గోపాల్, సంజీవ్, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పస్తాపూర్ గ్రామాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసిందని, అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు కృషి చేస్తానని టీఎస్ఎస్సీసీడీసీ చైర్మన్ ఏర్పుల నరోత్తం తెలిపారు. శుక్రవారం జహీరాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన సమావేశంలో పస్తాపూర్ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. గ్రామానికి చెందిన రాములు, చంద్రయ్య, నర్సమ్మ, కమలమ్మ, రంగ మ్మ, శంకరమ్మ, తుల్జమ్మ, పారమ్మ, రాణేమ్మ, అభుషమ్మలతోపాటు పలువురు పార్టీలో చేరిన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు స య్యద్ మసూద్ హుస్సేన్, కవేలి కృష్ణ, గోపాల్, మాణిక్‌ప్రభుగౌడ్ తదితరులున్నారు.