రేగోడ్, నవంబర్ 2: ‘అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదు, ఆ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారమవుతుంది. కర్ణాటక లెక్క కరెంట్‌కు గోసపడాల్సిందే.. టార్చిలైట్ పట్టుకొని పొలాల దగ్గరికి వెళ్లే రోజులు వ స్తాయి. ప్రజలారా మీ ఓటు రైతుబంధుకు వేస్తారో లేదా రాబంధువులకు వేస్తారో ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్, బీజేపీ కల్లబొల్లి మాటలు నమ్మకండి, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష’ అని బీఆర్ఎస్ అందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. గురువారం మండంలోని దోసపల్లి, లింగంపల్లి, సిందోల్, ప్యారారం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో క్రాంతికిరణ్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు వచ్చి తర్వాత వెళ్లిపోయే నాయకులకు ఈ ప్రాంతం మీద మమకారం ఉండదని, అందరికీ అందుబాటులో స్థానికంగా ఉంటానని చెప్పారు అభివృద్ధి, సంక్షేమమే తన ధ్యేయమన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా పథకాలు అమలు చేస్తామన్నారు. ఓట్ల కోసం వచ్చే ప్రతిపక్షాల కల్లబొల్లి మాటలు నమ్మవద్దు.
నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు కావడం లేదో ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అందోల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ చెబుతున్న ఆరు గ్యాంరంటీలకు వారంటీ లేదని, మన పథకాలకు మాత్రం సీఎం కేసీఆరే గ్యారంటీ అన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, నేడు పంజాబ్‌ని తలదన్నేలా వరి పండిస్తున్నామని తెలిపారు. ప్రచారంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుచ్చయ్య, ప్రధాన కార్యదర్శి రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, మాజీ అధ్యక్షుడు వినోద్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రవీందర్, మెదక్ జిల్లా రైతు బంధు సమితి సభ్యుడు బసంత్, రైతుబంధు మండల అధ్యక్షుడు రాధాకిషన్ గుప్తా, నాయకులు శ్రీను పటేల్, మైతాబ్, అక్బర్అలీ, షాదుల్, సర్పంచ్‌లు నర్సింలు, సమంత, తుకారాం నాయక్, సిధారెడ్డి, విజయలక్ష్మీగురునాథ్రెడ్డి, పూలమ్మ, మంజులానాగయ్య, శేఖర్, ప్రశాంత్, డైరెక్టర్ భాస్కర్, నర్సింగ్‌రావు, రాంరెడ్డి, ముప్పారం అంజయ్య, శ్యామయ్య, శివయ్య, బషయ్య, అమరసింహారెడ్డి, రాంకిష్టారెడ్డి, పండల్ రెడ్డి, శివకుమార్, సంతోష్, సంజీవ్, మోసీన్, రమేశ్, శ్రీనివాస్ రెడ్డి, రఘునాత్, వీరారెడ్డి ఉన్నారు.