చిలిపిచెడ్కు మహర్దశ
సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి పెద్దపేట వేశారు. ప్రతి గ్రామాల్లో మౌలిక సదుపాయా లు కల్పించడానికి నిధులు మంజూరు చేస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్ నర్సాపూర్‌లో హరితహారంలో భాగంగా ము ఖ్యఅతిథిగా వచ్చిన సందర్భంగా ప్రతి పంచాయతీ, మండ లకేంద్రాలకు ప్రత్యేక నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు.
- మండలానికి నిధుల వరద
- కోటి రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
- గ్రామాల అభివృద్ధికి పెద్దపీట
- ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు మంజూరు
- మండలంలో 18 పంచాయతీలు
- మొత్తం రూ.3.60 కోట్లు..
- గ్రామాల్లో పూర్తవుతున్న అభివృద్ధి పనులు
చిలిపిచెడ్, మార్చి 22 : సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి పెద్దపేట వేశారు. ప్రతి గ్రామాల్లో మౌలిక సదుపాయా లు కల్పించడానికి నిధులు మంజూరు చేస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్ నర్సాపూర్‌లో హరితహారంలో భాగంగా ము ఖ్యఅతిథిగా వచ్చిన సందర్భంగా ప్రతి పంచాయతీ, మండ లకేంద్రాలకు ప్రత్యేక నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం గ్రామాల్లోని ప్రధాన సమస్యలను తీర్చడానికి నిధులు కేటాయించింది. దీంతో గ్రామాలతోపాటు మండలకేంద్రాల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
చిలిపిచెడ్ మండలంలోని ప్రతి గ్రామపంచాయతీకి రూ. 20 లక్షల చొప్పున 18 పంచాయతీలకు రూ.3.60 కోట్లు, మండలకేంద్రానికి రూ. కోటి మంజూరు చేశారు. గ్రామాల్లో ప్రధాన సమస్యల పరిష్కారానికి నిధులు ఖర్చు చేస్తున్నా రు. చిలిపిచెడ్‌లో రూ. 50 లక్షలతో సీసీరోడ్లు, ము రుగునీటి కాల్వలు నిర్మించారు. రూ.50లక్షలను ప్రభుత్వ కార్యాలయానికి కేటాయించారు. చిట్కుల్, చండూర్, గౌ తాపూర్, ఫైజాబాద్, అజ్జమర్రి, శీలంపల్లి, జగ్గంపేట గ్రామాల్లో ఎస్సీ, బీసీ కమ్యూనిటీ భవనాలకు రూ.5 లక్షలు, మిగిత నిధుల తో సీసీ రోడ్లు, మురుగునీటి కాల్వలను నిర్మిస్తున్నారు.
పనులన్నీ పూర్తి చేస్తాం..
గ్రామపంచాయతీలకు మంజూరైన నిధులతో పాలక వర్గాలు తీర్మానం చేసిన పనులే చేపడుతున్నాం. చిలిపిచెడ్‌లో రూ.50 లక్షలతో చేపట్టిన పనులు పూర్తి చేశాం. రూ.50 లక్షలు తహసీల్ కార్యాలయ నిర్మాణానికి కేటా యించాం. శీలంపల్లి, జగ్గంపేట, చిట్కుల్, చండూరు, సోమక్కపేట గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నాం.
మధుబాబు, ఏఈ పంచాయతీరాజ్
పారిశుధ్య సమస్యలు తీరాయి
గతంలో వీధుల్లో నడవాలంటే భయమేసేది. వాన కాలమైతే కాలు బయట పట్టలేని పరిస్థితి. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు చిలిపిచెడ్ మండలకేంద్రానికి నిధు లు మంజూరయ్యాయి. దీంతో ప్రతి వీధిలో సీసీ రోడ్డు, మురుగునీటి కాల్వ నిర్మించాం. దీంతో మండలకేంద్రం లో పారిశుధ్య సమస్యలు తీరాయి. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో మండల కేంద్రానికి రూ.కోటి, గ్రామాలకు రూ.20లక్షలు మం జూరయ్యాయి. ఎమ్మెల్యే సహకారంతో చిలిపిచెడ్ మండల కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. – లక్ష్మీదుర్గారెడ్డి, చిలిపిచెడ్ సర్పంచ్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

