మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని, కాంగ్రెస్, బీజేపీ ఓట్లకోసం హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నాయని, ఎంపీపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ భూపాల్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆర్సీపురం డివిజన్లోని లక్ష్మీగార్డెన్స్‌లో విలేకరులతో వారు మాట్లాడారు. ఎంపీపై జరిగిన కత్తి దాడిని రేవంత్‌రెడ్డి కోడికత్తి డ్రామా అంటూ వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1991లో ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని దించేందుకు మత కల్లోలాలు సృష్టించి 400మందిని బలితీసుకున్న చరిత్ర కాంగ్రెస్‌ది అని గుర్తుచేశారు. తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ అహింసా మార్గంలో 14ఏండ్లు ఉద్యమం చేశారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు నీచ రాజకీయాలకు పాల్పడుతూ ప్రజల మధ్య గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. హత్యారాజకీయాలకు పాల్పడుతూ బీఆర్ఎస్ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించమని హెచ్చరించారు.
రామచంద్రాపురం, నవంబర్ 1: కాంగ్రెస్, బీజేపీలు ప్రజల్లో గందరగోళం సృష్టించి ఓట్లు దండుకోవడానికి హత్యా రాజకీయాలకు పూనుకున్నాయని, ఇది మంచి పద్ధతి కాదని, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన కత్తి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వి.భూపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆర్సీపురం డివిజన్లోని లక్ష్మీగార్డెన్స్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన కత్తి దాడిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోడికత్తి డ్రామా అంటూ వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. 1991లో ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని దించేందుకు మత కల్లోలాలు సృష్టించి 400 మందిని బలితీసుకున్న చరిత్ర కాంగ్రెస్‌కు ఉన్నదని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ స్వరాష్ట్ర సాధనకు 14 ఏండ్లు అహింసామార్గంలో ఉద్యమం చేశారన్నారు. సీఎం కేసీఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు క్రమశిక్షణతో మెలుగాలని నేర్పించారని, బీఆర్ఎస్ శ్రేణులు తలుచుకుంటే కాంగ్రెస్, బీజేపీలు కనుమరుగవుతాయని హెచ్చరించారు. ఇప్పటికీ సహనంతోనే ఉన్నామని, ఇలాంటి ఘటనలు పూనరావృతం సహించేంది లేదన్నారు. బీఆర్ఎస్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోనే అఖండ మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్పానగేశ్, సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్, యూత్ అధ్యక్షుడు నర్సింహ, డివిజన్ అధ్యక్షుడు గోవింద్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, ఏఎంసీ డైరెక్టర్లు ఐల్లేశ్, సత్యనారాయణ, ప్రమోద్‌గౌడ్, నాయకులు ఆదర్శ్‌రెడ్డి, యాదగిరియాదవ్, జగన్నాథ్‌రెడ్డి, బేకుయాద య్య, దేవేంద్రాచారి, నర్సింగ్‌రావు, కృష్ణకాంత్ ఉన్నారు.