Upadhi Coolies | రామాయంపేట, మార్చి 26 : నెల రోజులు దాటుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కూలీలకు కూలీ డబ్బులు ఇవ్వడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయని సీఐటీయూ నాయకురాలు బాలమణి డిమాండ్ చేశారు. ఇవాళ రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామ శివారులో జరుగుతున్న ఉపాధి కూలీల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తమకు కూలీ గిట్టుబాటు కావడం లేదని, కూలీ పనులు చేసి ఐదు వారాలు గడిచినా ప్రభుత్వం తమకు డబ్బులు ఇవ్వడంలో పూర్తి నిర్లక్ష్య వైఖరికి పాల్పడుతుందని కూలీలు తమ గోడును వెల్లబోసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఎండలో పనిచేస్తున్న కూలీలకు సరిగ్గా కూలీ ఇవ్వకపోవడమే గాకుండా నెలన్నర దాటినా కూలీలను పెంచుతామంటూ కాలయాపన చేయడం తప్ప కూలీ మాత్రం ఇవ్వడం లేదన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూలీలకు వెంటనే వారికి బకాయిపడ్డ కూలీని ఇవ్వాలని లేకుంటే రోడ్డెక్కిస్తామని పేర్కొన్నారు.
BRS : కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ అండ : రావులపల్లి రాంప్రసాద్
TTD | టీటీడీకి తిరుమల విద్యా సంస్థల చైర్మన్ భారీ విరాళం
Road Accident | సికింద్రాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి