సదాశివపేట, జూన్ 3: రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిస్తున్నదని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభారక్ అన్నారు. శనివారం మండలంలోని మద్దికుంటలో రైతు దినోత్సవాన్ని పండుగలా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్, కలెక్టర్ శరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ రైతుల పెట్టుపడి కోసం తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న రైతుబంధు, రైతు బీమా పథకాలు దేశంలో ఎక్కడా లేదన్నారు. గుంట భూమి ఉన్న రైతుకూ రూ.5 లక్షల బీమా అందజేస్తున్నారన్నారు. బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్నదన్నారు. ఇప్పటి వరకు మండలంలో 408 మందికి రైతు బీమా అందజేసినట్లు తెలిపారు. ఉచితంగా 24 గంటలు నాణ్యమైన కరెంట్‌ను అందజేస్తున్నదన్నారు.
రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం: కలెక్టర్ శరత్
రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టిందని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అన్నారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, నకిలీ విత్తనాలను అరికట్టడం, చెరువుల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం లాంటి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. దీంతో జిల్లాలో మూడు రెట్లు సాగు విస్తీర్ణం, పంట దిగుబడి పెరిగిందన్నారు. ముందస్తు సాగుపై రైతులు చర్చించాలని, వ్యవసాయ విస్తరణ అధికారులతో సందేహాలు నివృత్తి చేసుకుంటూ లాభదాయక సాగు చేయాలని రైతులకు సూచించారు. సంగారెడ్డి జిల్లాలో 116 రైతు వేదికలు నిర్మించారాన్నరు. రైతు మృతి చెందితే వారి కుటుంబాలను తక్షణమే ఆదుకునేందుకు రూ.5 లక్షలు రైతుబీమా అందజేస్తున్నట్లు తెలపారు. అంతకు ముందు రైతులు పెద్ద సంఖ్యలో ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి రవీందర్‌రెడ్డి, సర్పంచ్ అంజూమ్బేగం, ఏడీఏ, ఏఈవో, క్లస్టర్ పరిధిలోని ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.
రైతు సంక్షేమానికి సర్కారు కృషి: కలెక్టర్ శరత్
మునిపల్లి, జూన్ 3: రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. శనివారం మండలంలోని పెద్దలోడి గ్రామంలో నిర్వహించిన రైతు దినోత్సవంలో కలెక్టర్ పాల్గొన్నారు. అంతకు ముందు పెద్దలోడి గ్రామంలో నిర్వహించన ఏడ్ల బండి ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నదన్నారు. రైతు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు సాయికుమార్, పార్టీ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్, సర్పంచ్ పార్వతీ అశోక్, ఎంపీటీసీ రేణుకా వెంకటేశం, లక్ష్మీ నాగేశ్ పాల్గొన్నారు.
ఘనంగా మంత్రి పుట్టినరోజు వేడుకలు
మండలంలోని పెద్దలోడి గ్రామంలో మంత్రి హరీశ్‌రావు పుట్టినరోజు వేడుకలను ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్ ఘనంగా జరుపుకొన్నారు. కలెక్టర్ సమక్షంలో కేక్ కట్ చేసి ప్రజాప్రతినిధులు తినిపంచుకున్నారు.