సంగారెడ్డి, జూన్ 13: కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ భజన చేయడం మాని అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. శుక్రవారం సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 57 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, సీడీసీ మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులకు కాంగ్రెస్ నేతలు ఇప్పుడు శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకొంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో సంగారెడ్డికి రూపాయి నిధులు రావడం లేదన్నారు.
పక్క నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరుగుతుంటే, సంగారెడ్డి కాంగ్రెస్ నాయకులు ఎందుకు నిధులు తెచ్చి అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.వెంకటేశ్వర్లు, నర్సింలు, నాయకులు చిలువేరి ప్రభాకర్, మోహన్‌రెడ్డి, జీవి శ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి, చక్రపాణి, శ్రావణ్‌రెడ్డి, అంజాద్, శ్రీకాంత్ నాగరాజు, మల్లాగౌడ్ పాల్గొన్నారు.