సంగారెడ్డి సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందని సంగారెడ్డి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డిలోని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం సమైక్యతాదినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండా ఎగురవేశారు.
కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, బీఆర్ఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ఎంతోమంది త్యాగధునుల పోరాటం ఫలితంగానే తెలంగాణ(హైదరాబాద్ స్టేట్) భారతదేశంలో విలీనమైందన్నా రు. జాతీయ సమైక్యతాదినోత్సవాన్ని కొన్ని పార్టీలు ప్రజల మధ్య విద్వేషాలు పెంచేందుకు ఉపయోగించుకోవడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ హయాంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు గుర్తుచేశారు.
రైతుబంధు, పంట రుణమాఫీ, రైతుబీమా, కేసీఆర్‌కిట్, ఉచిత విద్యుత్ తదితర పథకాలు అమలు చేసి కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపినట్లు చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు, పంట రుణమాఫీ, ఉచిత కరెంటు పథకాలు అమలు చేయకుండా రైతులను ఇక్కట్లుకు గురిచేస్తుందన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జైపాల్‌రెడ్డి,ఎంఏ.హకీం, డీసీసీబీ వైస్‌చైర్మన్ మాణిక్యం, బీఆర్ఎస్ నాయకులు బుచ్చిరెడ్డి, డాక్టర్ శ్రీహరి, విజయేందర్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, చింతసాయినాథ్, ఆర్.వెంకటేశ్వర్లు, మధుసూదన్‌రెడ్డి, చీల మలన్న, వీరేశం, విష్ణు, జలందర్, వాజిద్, షకీల్, పరశురాంనాయక్ పాల్గొన్నారు.