కంది, ఏప్రిల్ 30: బసవేశ్వరుడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. బసవేశ్వరుడి 892 జయంతిని పురస్కరించుకొని బుధవారం కందిలోని బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజాన్ని స్థాపించిన మహనీయుడు బసవేశ్వరుడని కొనియాడారు.
అన్ని కులాలు మతాల మహిళలకు సమానత్వం కావాలని కోరాడని, కష్టంలోనే సుఖం, స్వర్గం ఉందని చెప్పిన మహానుభావుడని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ రాబోయే తరాలకు వారు ఆచరించిన విధానాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో శివరాజ్ పాటిల్, వీరేశం, మల్లిఖార్జున్, నాగరాజు పాల్గొన్నారు.