సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం గ్రామాన్ని, పారిశ్రామికవాడను రసాయన పరిశ్రమల కాలుష్య పొగ కమ్మేసింది. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కాలుష్య పొగ కమ్మేయడంతో ప్రజలు, కార్మికులు అవస్థలు పడ్డారు. అసలే చలికాలం కావడంతో ప్రమాదకర రసాయనాల పొగతో నానా ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
పరిశ్రమల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పరిశ్రమల యాజమాన్యాల తీరులో మార్పు రావడం లేదని, పీసీబీ అధికారులు సైతం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
– జిన్నారం, నవంబర్ 15