మెదక్ మున్సిపాలిటీ/ సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 15 : మెప్మా సిబ్బందికి ప్రభుత్వం పే స్కేల్ వర్తింపజేయడంతో మం గళవారం మున్సిపల్ కార్యాలయంలో సీఎం కేసీఆర్, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు మెప్మా సిబ్బంది క్షీరాభి షేకాలు నిర్వహించారు. మెప్మా సిబ్బంది సునీత, దేవపాల, ఆసియా, ఇందిర, సువణ్ డగ్లస్ తదితరులు మెదక్ పట్టణంలో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ..ఎన్నో ఏండ్లుగా పేస్కేల్ కోసం ఎదురు చూస్తున్నామని, సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో పే స్కేల్ వర్తింప చేయడం సం తోషంగా ఉందన్నారు. కేసీఆర్ జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, శ్రీనివాస్, బట్టి లలిత, నాయకులు శివరామకృష్ణ, వెంకటనారాయణ, కొండ శ్రీనివాస్, ప్రభురెడ్డి, శంకర్, అరవింద్‌గౌడ్ పాల్గొన్నారు.
పే స్కేల్ పెంచుతూ జీవో 157 విడుదల
పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనశాఖ(మెప్మా)లో పనిచేస్తున్న ఉద్యోగులకు పే స్కేల్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 157 విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద మెప్మా ఉద్యోగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చే శారు. అనంతరం పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో మెప్మా ఉద్యోగులు బస్వంత్‌రెడ్డి, మల్లేశ్వరి, స్వర్ణకుమారి, విజయభారతి, సువర్ణ, శ్రీనివాస్, సంద్యారాణి, కవిత, రాజ్యలక్ష్మీ, ప్రణీత, రాజశేఖర్, రజనీకాంత్, భిక్షపతి తదితరులు కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.