Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో నటిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). హరీష్ శంకర్ (Harish shankar) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా… రాశీఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది.
టాలీవుడ్ టాప్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ సింగిల్ దేఖ్ లేంగే సాలా నెట్టింటిని షేక్ చేస్తోంది. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి Aura Of Ustaad సాంగ్ ప్రోమో విడుదల చేశారు. పవన్ కల్యాణ్ స్టైల్ ఆఫ్ మ్యానరిజంతో సాగే ఈ పాట అభిమానులకు కావాల్సిన ఎలిమెంట్స్‌తో స్టన్నింగ్‌గా ఉండబోతుందని ప్రోమో హింట్ ఇచ్చేస్తుంది.
ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ రాసిన ఈ పాటను డీఎస్పీ కంపోజిషన్‌లో పీ అభిషేక్ అండ్ డీఎస్పీ టీం పాడింది. ఫుల్ సాంగ్‌ను ఫిబ్రవరి 22న విడుదల చేయనున్నారు మేకర్స్. భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌లో పవన్ కల్యాణ్ తనదైన స్టైల్లో డైలాగ్స్ చెబుతూ ఇప్పటికే సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు పవన్ కల్యాణ్.
గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు తీసుకొస్తున్నారు.
The AURA that defined an ERA 🔥🔥🔥#UstaadBhagatSingh second single #AuraOfUstaad Promo out now!
▶️ https://t.co/a9IMURjqXLFull song on February 22nd 🤩#UstaadBhagatSingh GRAND RELEASE WORLDWIDE ON 26th MARCH, 2026.#UBSOnMarch26th
POWER STAR @PawanKalyan @harish2you… pic.twitter.com/9Rm5ChHOB0
— Mythri Movie Makers (@MythriOfficial) February 19, 2026