సమస్యలు పరిష్కరించాలి
సింగూరు ప్రాజెక్టులో సరిపడా నీళ్లున్నా సాగుకు నీటిని విడుదల చేయడం లేదని, మరమ్మతుల పేరుతో ఆలస్యం జరుగుతోందని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం కలెక్టర్ ప్రావీణకు ఎమ్మెల్యే చింతాప్రభాకర్తో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు.
- సింగూరులో నీరున్నా సాగుకు విడుదల చేయడం లేదు
- సంగారెడ్డి, అందోల్ నియోజకవర్గాల సమస్యలపై కలెక్టర్‌కు వినతి
సంగారెడ్డి, ఏప్రిల్ 17: సింగూరు ప్రాజెక్టులో సరిపడా నీళ్లున్నా సాగుకు నీటిని విడుదల చేయడం లేదని, మరమ్మతుల పేరుతో ఆలస్యం జరుగుతోందని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం కలెక్టర్ ప్రావీణకు ఎమ్మెల్యే చింతాప్రభాకర్తో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సింగూర్ ప్రాజెక్టులో నీళ్లున్నా సాగుకు నీటిని విడుదల చేయకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
రెండున్నర సంవత్సరాలుగా ఎడమ కాలువలో చుక్క నీరు విడుదల కాలేదని, దిగువ ప్రాంతాలు అయిన ఘనాపూర్ ఆ యకట్టు ప్రాంతాలకు మాత్రం నీరు అందుతున్నదన్నారు. పుల్కల్, అందోల్ మండలాల్లో విస్తారమైన సాగు భూములు నీటి వసతి లేక బీడుగా మారుతున్నాయన్నారు. రెండు యాసంగి సీజన్లలో రైతులు పంటలు వేయకుండా భూములు బీడుగా ఉంచాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇటీవల ప్రాజెక్టు నుంచి నీటిని ఎలాంటి సమాచారం లేకుండా విడుదల చేయడంతో పోచారం, ముద్దాయిపేట్, పుల్కల్, మిన్పూర్, ఇసోజీపేట, గంగోజీపేట గ్రామాల్లో వందల ఎకరాల పంటలు మునిగిపోయాయని కలెక్టర్ వివరించారు.
పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలి
సంగారెడ్డి నియోజకవర్గంలో పలు పెండింగ్ పనుల వివరాలను కలెక్టర్ దృష్టికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీసుకొచ్చారు. గిర్మాపూర్ సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దాని పరిష్కారానికి వెంటనే ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు.
నియోజకవర్గంలో కొనసాగుతున్న పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసేవిధంగా అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తిచేశారు. వెంటనే స్పందించిన కలెక్టర్ గిర్మాపూర్ సాఘిక సంక్షేమ వసతిగృహంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యేకు తెలిపారు. వీరి వెంట నాయకులు జైపాల్‌రెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, విజయ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

