BRS | బీఆర్ఎస్ శ్రేణులకు బాస్ భరోసా.. కేసీఆర్ నీడలో భద్రంగా గులాబీ సైన్యం
బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కేసీఆర్ గుండెల్లో ఉన్నట్టే, ఆయన మానవీయ స్పర్శను జీవితాంతం వెంటబెట్టుకున్నట్టే అని గులాబీ శ్రేణులు చెప్తుంటాయి. పార్టీ తమకు అనుక్షణం అండగా ఉంటుందని భరోసాగా ఉంటాయి. ఇది అక్షర సత్యమని అనేక సందర్భాల్లో నిరూపితం అయ్యింది. తాజాగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబం విషయంలోనూ తేటతెల్లమైంది.
- నేతలు, కార్యకర్తలకు అండగా పార్టీ
- ఇప్పటికే రూ.110 కోట్ల బీమా క్లెయిమ్స్
బీఆర్ఎస్ శ్రేణులే నా బలం. నన్ను నడిపించే శక్తి మీరే. నేను పిడికెడు మందితో ప్రయాణం మొదలుపెట్టినప్పుడు, నన్ను నమ్మి వచ్చి, ఊరూరా కథానాయకులై కదిలారు. పార్టీ కోసం కష్టపడ్డారు. రాష్ట్రం కోసం పరితపించారు. అటువంటి మీకు నేను ఏమిచ్చినా రుణం తీరదు. తల్లికోడి తన పిల్లలను కాపాడుకున్నట్టే, నేను మిమ్మల్ని కాపాడుకుంట. మీ కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తా.
– బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (పార్టీ కార్యకర్తలతో జరిగే సమావేశాల్లో)
కుటుంబ సభ్యులను కోల్పోయిన పార్టీ కార్యకర్తలు, నేతల కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు మేమందరం ఉన్నం. మనందరికీ పార్టీ ఉన్నది, పెద్ద దిక్కు కేసీఆర్ ఉన్నరు. అందరినీ ఆదుకుంటరు. మనోధైర్యంగా ఉందాం. పట్టుదలతో ముందుకు సాగుదాం.
-పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ప్రమాద బీమా చెక్కులు అందజేసే సందర్భాల్లో)
వరంగల్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కేసీఆర్ గుండెల్లో ఉన్నట్టే, ఆయన మానవీయ స్పర్శను జీవితాంతం వెంటబెట్టుకున్నట్టే అని గులాబీ శ్రేణులు చెప్తుంటాయి. పార్టీ తమకు అనుక్షణం అండగా ఉంటుందని భరోసాగా ఉంటాయి. ఇది అక్షర సత్యమని అనేక సందర్భాల్లో నిరూపితం అయ్యింది. తాజాగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబం విషయంలోనూ తేటతెల్లమైంది. పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేసిన కార్యకర్తలు, నాయకుల పట్ల బీఆర్ఎస్ పార్టీ చూపించే ఔదార్యం మరే పార్టీ చూపించదని గులాబీ శ్రేణులు గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు పార్టీ తరఫున రూ.2 లక్షల ప్రమాద బీమా చేయించారు. కార్యకర్తలకు అండగా ఉంటామని ప్రచారం కోసం రాజకీయ పార్టీలు ప్రకటించడం వరకేగానీ, బీఆర్ఎస్లా క్రమం తప్పకుండా ప్రమాదబీమా వర్తింపజేసిన పార్టీ మరొకటి లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దురదృష్టవశాత్తూ ఎవరైనా కార్యకర్త మరణిస్తే క్లెయిమ్ చేసి, ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. 2015-16 నుంచి ఇప్పటి దాకా సుమారు 5,600 కుటుంబాలు రూ.110 కోట్ల పైచిలుకు ప్రమాద బీమా క్లెయిమ్స్‌ను పొందినట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి.
అన్నివిధాలా అండగా..
తెలంగాణ ఉద్యమం, స్వరాష్ట్ర ప్రగతి పయనంలో తనతో నడిచిన ఉద్యమకారులు, పార్టీ క్యాడర్‌ను బీఆర్ఎస్ అధినేత గుండెల్లో పెట్టుకొని కాపాడుకున్నారు. పార్టీ పదవులతోపాటు వేలాది మందికి పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా రాజకీయ అవకాశాలు కల్పించారు. నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలు, నాయకులు అకాల మరణం చెందితే వారి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ పెద్ద దిక్కుగా నిలిచిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. ప్రజా ఉద్యమ గాయకుడు సాయిచంద్, బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేసిన కుసుమ జగదీశ్, తాజాగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిసహా మరికొందరు నాయకులు అకాలమరణం చెందితే వారి కుటుంబాలకు కేసీఆర్ అన్ని విధాలుగా అండగా నిలిచారు.
- సాయిచంద్ సతీమణి రజినికి రాష్ట్ర కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు. ఆమెకు రూ.కోటి, సాయిచంద్ సోదరి, తండ్రికి ఒక్కొక్కరికీ రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు.
- ములుగు జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేస్తూ గుండెపోటుతో అకాల మరణం చెందిన కుసుమ జగదీశ్ కుటుంబాన్ని సైతం పార్టీ ఆదుకున్నది. రూ.కోటిన్నరలో జగదీశ్ ముగ్గురు పిల్లలకు రూ.25 లక్షల చొప్పున, అతని తల్లిదండ్రులకు రూ.25 లక్షలు ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని ఆయన సతీమణికి అందజేశారు. ఆయన కుమార్తె సుకీర్తన మెడికల్ పీజీ ఫీజును కేసీఆరే చెల్లిస్తున్నారు.
- ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర నేత కొనపురి సాంబశివుడి (మావోయిస్టు మాజీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి జనజీవన స్రవంతిలోకి కలిసి బీఆర్ఎస్లో చేరిన నాయకుడు) కుటుంబానికి పార్టీ అండగా నిలిచింది. సాంబశివుడి కుమార్తె స్వర్ణ వివాహానికి రూ.10లక్షలను అందజేసింది.
- ఖమ్మం పట్టణానికి చెందిన డోకుపర్తి సుబ్బారావు అనారోగ్యంతో ఉన్నారనే విషయం తెలిసి, తన ఇంటికి పిలిపించుకొని కేసీఆర్ రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
- తెలంగాణ అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ అన్నీ తానై అండగా నిలిచారు. ఆయన చేయూతతో కిష్టయ్య కుమార్తె డాక్టర్ కావడం తెలిసిందే.
అనుక్షణం తోడుగా..
తన సహచరులకు ఏదైనా జరిగితే కేసీఆర్ తల్లడిల్లిపోతుంటారు. పార్టీ అనుక్షణం తోడుగా ఉండి కాపాడుకుంటుంది. ఇందుకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఉదంతమే ప్రత్యక్ష ఉదాహరణ. గత నెల 26న పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతతో వరంగల్‌లోని ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలిసిన వెంటనే కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావును పురమాయించారు. తక్షణమే వరంగల్‌కు వెళ్లి పెద్దికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వారు, పార్టీ ఇతర ముఖ్యనాయకులు హుటాహుటిన వరంగల్‌కు వెళ్లి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం కోసం దగ్గరుండి హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ ఏం జరుగుతున్నదో కేసీఆర్ నిత్యం వాకబు చేయడమే కాకుండా, ప్రత్యక్షంగా దవాఖానకు వెళ్లి పరామర్శించి, పెద్ది ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. చికిత్స పొందుతూ కన్నుమూసినప్పటి నుంచి అంతిమయాత్ర జరిగేదాకా పార్టీ మొత్తం సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి తోడుగా నిలిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యనాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా మొత్తం పార్టీ కేడర్ పెద్ది కుటుంబానికి, నర్సంపేట నియోజకవర్గ పార్టీ శ్రేణులకు అన్ని విధాలుగా అండగా నిలువాలని పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సుదర్శన్‌రెడ్డి భౌతికంగా వెళ్లిపోయినా పార్టీ పెద్దదిక్కుగా నిలబడిందనే సంకేతాన్ని ఇచ్చారు. మరోవైపు ఈ నెల 10న నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్‌రెడ్డి సంస్మరణ సభను నిర్వహించేందుకు నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేసుకుంటున్నారు. మొత్తంగా ఒక రాజకీయ పార్టీ రెండువారాలుగా ఒక నాయకుడికి, ఆయన కుటుంబానికి అండగా నిలిచిన వైనంపై రాజకీయాలకు అతీతంగా చర్చసాగుతున్నది. పెద్ది వంటి నిబద్ధత గల కార్యకర్తకు బీఆర్ఎస్ ఇచ్చిన గౌరవం, చూపుతున్న ఆదరణ అన్ని రాజకీయ పార్టీలకు పాఠంలా నిలుస్తుందని చెప్తున్నారు.
తల్లిదండ్రులకూ భరోసా
సాధారణంగా రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలు మరణిస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి చేతులు దులుపుకుంటాయి. లేదా పార్టీ తరఫున కొంత ఆర్థిక సాయం ప్రకటిస్తుంటాయి. కానీ కేసీఆర్ తన ఉద్యమ సహచరుల కుటుంబాలకు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తున్నారు. తనతో నడిచిన నేతలు, కార్యకర్తలు ఎవరైనా మరణిస్తే వారి భార్యాపిల్లలకు భరోసా ఇవ్వడంతోపాటు, వారిపై ఆధారపడిన తల్లిదండ్రులు, సోదరీమణులకు కూడా ప్రత్యేకంగా ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. సాయించంద్ కుటుంబానికి ప్రకటించిన ఆర్థిక సాయంలో తండ్రికి, సోదరికి రూ.25 చొప్పున కేటాయించారు. కుసుమ జగదీశ్ తల్లిదండ్రులకు రూ.25 లక్షలు అందజేశారు. తాజాగా పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లికి రూ.25 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇలా పార్టీ కార్యకర్తలు, నేతల తల్లిదండ్రుల గురించి ఒక పార్టీ ఆర్థికంగా ఆదుకోవడం రాజకీయ చరిత్రలోనే అత్యంత అరుదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

