Police Department | నిరుద్యోగులకు సర్కార్ ధోకా.. నిరుద్యోగుల పాలిట దగా హస్తం..! పోలీసుశాఖలో ఉన్న ఖాళీలు 19 వేలపైనే..
తెలంగాణ పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది నిరుద్యోగుల పాలిట దగా ‘హస్తం’గా కాంగ్రెస్ పార్టీ కీర్తికెక్కింది. పోలీసుశాఖలో ఖాళీలు వేలల్లో ఉంటే.. నిరుద్యోగులను వంచిస్తూ కేవలం 7 వేల కొలువులనే భిక్షంగా వేసింది.
- పోలీసుశాఖలో ఉన్న ఖాళీలు 19 వేలపైనే..
- కేవలం 7,437 పోస్టులతో సరిపెట్టిన కాంగ్రెస్
- 2025 ఫిబ్రవరి నాటికే 14,874 ఖాళీలు
- 8,450 వరకు సివిల్ కానిస్టేబుల్ ఖాళీలు
- ఏఆర్ కానిస్టేబుల్ ఖాళీలు 3,271కి పైనే
- 739 వరకు ఎస్సై విభాగాల్లో ఖాళీలు
- 2026 జూలై నాటికి పెరిగిన రిటైర్మెంట్లు
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది నిరుద్యోగుల పాలిట దగా ‘హస్తం’గా కాంగ్రెస్ పార్టీ కీర్తికెక్కింది. పోలీసుశాఖలో ఖాళీలు వేలల్లో ఉంటే.. నిరుద్యోగులను వంచిస్తూ కేవలం 7 వేల కొలువులనే భిక్షంగా వేసింది. 20 వేల మెగా నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న నిరుద్యోగుల ఆశలను అడియాశలు చేస్తూ.. వారి భావోద్వేగాలతో బంతాట ఆడుతూ.. 7 వేల కొలువులకే మొగ్గు చూపింది.
కాగా, తెలంగాణ పోలీసుశాఖలో కానిస్టేబుల్ నుంచి డీఐజీ వరకూ సుమారు 15 వేల వరకు ఖాళీలు ఉన్నట్టు ఆర్టీఐ పిటిషన్ ద్వారా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని ఎల్లారెడ్డిగూడకు చెందిన కేఏఎస్ గురుతేజ అనే సోషల్ యాక్టివిస్టు ఆర్టీఐ ద్వారా పోలీసుశాఖను ఖాళీల వివరాలు కోరగా.. 2025 ఫిబ్రవరి నాటికే అన్ని విభాగాల్లో కలిపి సుమారు 14,874 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పేర్కొన్నది. అయితే ఎస్పీ, అంతకంటే పైస్థాయి పోస్టులను ప్రభుత్వం అర్హులతో ఇప్పటికే భర్తీ చేసింది.
2025 ఫిబ్రవరి నాటికి మొత్తం సాంక్షన్డ్ స్ట్రెంథ్ పోస్టులు 91,169 కాగా.. 76,295 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. దీంతో 14,874 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పోలీసుశాఖ వివరణ ఇచ్చింది. తెలంగాణ పోలీసుశాఖలో ప్రతియేటా రిటైర్ అవుతున్నవారిలో సింహభాగం కానిస్టేబుళ్లే ఉన్నారు. ఆ తర్వాత ఏఎస్సైలు, ఎస్సైలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య ఏటా 1,800-2,000 మధ్యలో ఉంటుందని సమాచారం. ఈ లెక్కన ఏడాదిన్నరలో మరో 3,000 పోస్టులు ఖాళీ అవుతాయి. ఇదే విషయమై.. మాజీ డీజీపీ తెలంగాణ పోలీసుశాఖలో 2026 చివరినాటికి 19వేల ఖాళీలు ఉంటాయని, 2026 మొదటి త్రైమాసికంలో 17 వేల ఖాళీలు ఉన్నాయని, త్వరగా నోటిఫికేషన్ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వానికి నివేదిక సైతం పంపారు. ఆ నివేదికలను బుట్టదాఖలు చేసిన ప్రభుత్వం.. కేవలం 7,437 పోస్టుల భర్తీకి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఏఆర్, సివిల్లలో 11,721 ఖాళీలు..
2025 ఫిబ్రవరి నాటి ఆర్టీఐ పిటిషన్ ఆధారంగా పోలీసు సివిల్ కానిస్టేబుల్ సాంక్షన్డ్ స్ట్రెంథ్ 32,923 కాగా.. విధుల్లో ఉన్నవారు 24,481 మంది. దీంతో అక్కడ 8,442 ఖాళీలు ఏర్పడ్డాయి. అలాగే ఏఆర్ కానిస్టేబుళ్ల సాంక్షన్డ్ స్ట్రెంథ్ 18,506 ఉండగా.. అప్పటికే విధుల్లో ఉన్నవారు 15,235 మంది. దీంతో అక్కడ ఏర్పడిన ఖాళీలు 3,271. ఈ సివిల్, ఏఆర్ విభాగాల ఖాళీలు కలిపితే మొత్తం ఖాళీలు 11,721 ఉన్నాయి.
తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం సుమారు 1,380 ఖాళీలు భర్తీ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తం కలిపితే 13,101 ఖాళీలు ఉన్నట్టు తెలుస్తున్నది. దీంతోపాటు ఎస్సై స్థాయిలో ఎస్సై సివిల్ సాంక్షన్డ్ స్ట్రెంథ్ పోస్టులు 3,852 కాగా అప్పటికే విధుల్లో ఉన్నవారు 3,175 మంది. దీంతో అక్కడ ఏర్పడిన ఖాళీలు 677. ఏఆర్ ఎస్సై సాంక్షన్డ్ స్ట్రెంథ్ 532 ఉండగా.. అప్పటికే విధుల్లో ఉన్నవారు 492.
అక్కడ ఏర్పడిన ఖాళీలు 40. అలాగే టీజీఎస్పీ ఎస్సై పోస్టులు 550 కాగా, అప్పటికే విధుల్లో ఉన్నవారు 528 మంది. దీంతో ఏర్పడిన ఖాళీలు 22. మొత్తం ఎస్సైస్థాయి పోస్టులు లెక్క కడితే.. 739 ఖాళీలు ఉన్నాయి. వీటికి పీటీవో, ఎస్ఏఆర్సీపీఎల్, ఐటీ అండ్ సీ, రైల్వేస్, పోలీసు ప్రెస్ వంటి విభాగాలు కలిపితే మరిన్ని ఖాళీలు ఉండే అవకాశం ఉన్నది.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

