వట్పల్లి, ఏప్రిల్ 10: అనేక త్యాగాలు, శాంతియుత పోరాటం, కేసీఆర్ చాణక్యంతోనే తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యిందని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. గురువారం వట్పల్లిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్పోస్టర్ను బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించి గోడకు అతికించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమం కోసం ఒక రాజకీయ పార్టీ ఏర్పడడం దేశంలోనే తొలిసారని, బీఆర్ఎస్లో సభ్యులుగా ఉన్నందుకు మనమందరం గర్వపడాలన్నారు.
అన్ని గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు సభకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో ఘోరంగా విఫలమైందన్నారు. రేవంత్ అసమర్ధ పాలనతో అన్నివర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వం వైపు చూస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వీరారెడ్డి, అశోక్ గౌడ్, నర్సింలు, బస్వరాజు, బుద్దిరెడ్డి, దీప్లానాయక్, సంగమేశ్వర్, ప్రభాకర్, శేఖర్, మధు, ప్రకాశ్, సుభాష్, మారుతి, మహేదర్, బాపురావు, నరేందర్ రెడ్డి, వీరారెడ్డి, సుభాష్ పాల్గ్గొన్నారు.