మునిపల్లి, ఏప్రిల్ 21 : కాంగ్రెస్‌కు ఓటేసి తప్పుచేశామని, మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ప్రజలంతా కోరుతున్నారని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని ఖమ్మంపల్లి గ్రామ శివారులోని శ్రీసాయి గార్డెన్లో నిర్వహించిన బీఆర్ఎస్ మండల ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చంటి క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో సంక్షేమం ఆగిపోయిందని, పథకాలు సరిగ్గా అమలు కావడం లేదని, అభివృద్ధి అటకెక్కిందని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, హామీలు బుట్టదాఖలైనట్లు తెలిపారు.
ఈనెల 27న ఎల్కతుర్తిలో జరిగే బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు గులాబీ శ్రేణులు, ప్రజలు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. మండలం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని, సభ అనంతరం తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని సూచించారు. సమావేశంలో నాయకులు జైపాల్‌రెడ్డి, సాయికుమార్, భాస్కర్, మంతూరి శశికుమార్, రమేశ్, శ్రీనివాస్, ఏడ్ల శంకర్, విఠల్, శివకుమార్, రాజశేఖర్, ఆనంద్‌రావు, మౌలానా, రాంచందర్‌రావు పంతులు, కుతుబొద్దీన్, వెంకటేశం, మొగులయ్య, ప్రభు, మొగులయ్య, శంకరయ్య, సుధాకర్, శ్రీనివాస్, నాగేశ్, పాండు, సుభాష్, దుర్గయ్య, మల్లేశం, ఈశ్వరప్ప పాల్గొన్నారు.
సిద్దిపేట, ఏప్రిల్ 21: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్ల్లేందుకు దారి ఖర్చుల కోసం సిద్దిపేట వర్తక వ్యాపారులు అందించిన సహకారం మరువలేనిదని సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి అన్నారు. సోమవారం రాజనర్సు, సంపత్‌రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు సిద్దిపేటలోని నందిని శ్రీనివాస్ రైస్‌మిల్లులో, సిద్దిపేట ట్రాన్స్‌పోర్టు, ఎస్ఆర్ సీడ్స్, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి డెయిరీ ఫాంలో కూలిపని చేశారు.
నందిని శ్రీనివాస్ మిల్లులో కూలిపనికి లక్ష రూపాయలు, ఎస్ఆర్ సీడ్స్ యజమాని కూర శ్రీనివాస్ రూ.50వేలు, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి రూ. 5వేలు, సిద్దిపేట ట్రాన్స్‌పోర్టు యాజమాన్యం రూ. 2వేలు పట్టణ అధ్యక్షుడు సంపత్‌రెడ్డికి అందించి రజతోత్సవ సభకు తమ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఈనెల 27న జరిగే రజతోత్సవ సభకు సిద్దిపేట నుంచి భారీసంఖ్యలో మహిళలు, కార్యకర్తలు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా చూడాలని ప్రజలందరూ కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎలతుర్తి సభకు సిద్దిపేట నుంచి సుమారు 30 వేల మంది నాయకులు, కార్యకర్తలు తరలివెళ్తామని తెలిపారు.
యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మరో 2వేల మందితో సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వరకు పాదయాత్రగా సభకు వెళ్లనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ హామీల అమలులో, పాలనలో ఘోరంగా విఫలమైనట్లు బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, కౌన్సిలర్లు బర్ల మల్లికార్జున్, తాడూరి సాయిశ్వర్గౌడ్, నాగరాజు రెడ్డి, కలకుంట్ల మల్లికార్జున్, అరవింద్‌రెడ్డి, మోయిజ్, తిరుమల్‌రెడ్డి, గుడాల శ్రీకాంత్, మోహన్‌లాల్, పోశెట్టి శ్రీకాంత్, బచ్చు రమేశ్, జువ్వన్న కనకరాజు, రామస్వామి, పోన్నమల్ల రాములు, రెబల్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.