చేర్యాల, సెప్టెంబర్ 10 : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో వివిధ కార్యక్రమాలకు హాజరైన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న సం క్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక శ్రద్ధతో చేర్యాల, జనగామ ప్రాంతాలను అన్నివిధాలుగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీన జనగామ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలను ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ రానున్నట్లు చెప్పారు. జనగామలో నిర్వహించే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మం డలాల నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని పలుపునిచ్చారు. ప్రతిపక్షాలకు రానున్న ఎన్నికల్లో చావుదెబ్బ తప్పదని, కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మడం లేదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్, మార్కెట్ వైస్ చైర్మన్లు నిమ్మ రాజీవ్‌రెడ్డి, పుర్మ వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వర్రావు, కేసీఆర్ అభిమాన సంఘం జాతీ య ప్రధాన కార్యదర్శి ముస్త్యాల బాల్‌నర్సయ్య, మల్లన్న ఆలయ డైరెక్టర్లు కందుకూరి సిద్ధి లింగం, పచ్చిమడ్ల సిద్ధి రాములు, నాయకులు మంచాల కొండయ్య, చింతల పరశురాములు, ఇన్నారెడ్డి, తాడెం కృష్ణమూర్తి, నర్ర ఐలయ్య, ఆరోగ్యరెడ్డి, పచ్చిమడ్ల సాయికిరణ్ పాల్గొన్నారు.
చాకలి ఐలమ్మ నేటి మహిళలకు ఆదర్శనీయం
చాకలి ఐలమ్మ నేటి మహిళలకు ఆదర్శనీయమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మండల రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ఎమ్మెల్యే ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చాకలి ఐలమ్మ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాలుగు మండలాల ఇన్చార్జి శివగారి అంజయ్య, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దళితబంధును సద్వినియోగం చేసుకోవాలి
దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి, పటిష్టంగా అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణానికి చెం దిన బడుగు నరేశ్‌కు ప్రభుత్వం దళితబంధు పథకం కింద మంజూరు చేసిన కారు తాళాలను లబ్ధిదారుడికి అందజేశారు. మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ యాట కనకమ్మ యాదగిరి కుమారుడు శ్రీకాంత్ వివాహం అనుపమతో పట్టణంలోని శివప్రసన్న గార్డెన్స్‌లో జరిగింది. వివాహ వేడుకకు ఎమ్మెల్యే హాజరై వధూవరులను ఆశీర్వదించారు. పట్టణంలోని వివిధ కార్యక్రమాలకు వచ్చిన ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బ్యాండ్ వెంకటయ్య, శనిగారి యాదయ్య స్వాగ తం పలికారు. వెంటనే ఎమ్మెల్యే ఇరువురి నాయకులను దగ్గరకు తీసుకుని వారి కోరమీసాలను మెలేసి సంతోషం వ్యక్తం చేశారు.