నర్సాపూర్ : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మెదక్ జిల్లా నర్సాపూర్ చేరుకున్నారు. కాగా, నర్సాపూర్ చౌరస్తా నుండి సాయి కృష్ణ గార్డెన్‌కు వస్తున్న క్రమంలో మంత్రి కాన్వాయ్ వెనుకాల ఓ కారు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనక ఉన్న కార్లు ఒకదానికి మరొకటి ఢీ కొన్నాయి.
ఈ ప్రమాదంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, మాజీ జెడ్పిటిసి కమలా ఫూల్ సింగ్, మాజీ ఎంపీపీ లలిత నర్సింగ్ అలాగే మరో ఇద్దరికి సంబంధించిన కార్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.