సిద్దిపేట కమాన్, మే 9: వీర జవాన్ మురళీనాయక్ మృతిపై సిద్దిపేటలో తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎస్టీ హాస్టల్ నుంచి ముస్తాబాద్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి మురళీనాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్యా భిక్షపతినాయక్ మాట్లాడుతూ జమ్ముకశ్మీర్లో దేశ భద్రత కోసం పోరాడుతూ పాక్ ముష్కరుల దాడిలో మురళీనాయక్ వీరమరణం చెందాడని.. ఈ విషయంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాగు నాయక్, రమేశ్ నాయక్, సత్యనారాయణ నాయక్, పరశురాములు నాయక్, గోపి నాయక్, నాగరాజు నాయక్, ముని నాయక్, గోవర్ధన్ నాయక్, సాయి నాయక్, సంతోష్ నాయక్, నవీన్ నాయక్, గిరిజన నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.