పటాన్చెరు, డిసెంబర్ 16: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ కళాశాలలో గ్రూప్-2 పరీక్ష రాస్తూ నగేశ్ అనే అభ్యర్థి ఫిట్స్‌తో పడిపోయాడు. తక్షణం స్పందించిన అధికారులు అతడిని చికిత్స కోసం స్థానిక దవాఖానకు పంపించారు. వివరాల్లోకి వెళితే… పుల్కల్ మండలం లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన నగేశ్ సోమవారం పటాన్చెరు డిగ్రీ కళాశాలలో గ్రూప్-2 పరీక్షకు హాజరయ్యారు.
పరీక్ష రాస్తూ ఫిట్స్‌తో సృహతప్పి పడిపోయాడు. వెంటనే స్పందించిన పరీక్ష సిబ్బంది పోలీసులకు తెలపడంతో ఎస్ఐ ఆసీఫ్ అలీ అభ్యర్థిని మొదటి అంతస్తు నుంచి కిందికి దించి పటాన్చెరు ఏరియా దవాఖానకు తరలించి చికిత్స చేశారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటు వచ్చిందని తేల్చారు. దీంతో అభ్యర్థి కుటుంబ సభ్యులు నగేశ్‌కు మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డిలోని ఓ వ్రేటు దవాఖానకు తరలించారు.