గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలనే డిమాండ్‌తో తాజా మాజీ సర్పంచ్ల ఫోరం అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో జిల్లా పరిధిలోని గ్రామాల మాజీ సర్పంచ్‌లను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు.
అనంతరం సొంత పూచీకత్తుపై వదిలిపెట్లారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో తమ సొంత నిధులు వెచ్చించి పనులు చేయించామని, కానీ ప్రభత్వం తమకు బిల్లులు చెల్లించండం లేదని వాపోయారు. కొన్ని నెలలుగా గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ఎక్కడ చూసినా సమస్యలు తాండవం చేస్తున్నాయని ఆరోపించారు. కొన్ని గ్రామాల్లో కార్యదర్శులు వారి జీతాలతో పనులు చేయించే దుస్థితి ఏర్పడిందన్నారు. ఇవ్వన్నీ ప్రశ్నించేందుకు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వగా ఇలా అక్రమ అరెస్ట్‌లు చేయడం అప్రజస్వామికమని మండిపడ్డారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 2