Businessman Missing | రామాయంపేట, ఏప్రిల్ 21 : బతుకు దెరువు కోసం వచ్చిన వ్యాపారి అదృశ్యమైన ఘటన రామాయంపేట పట్టణంలో చోటుచేసుకుంది. బట్టల వ్యాపారి బాబుల్ సింగ్(23) గత మూడు రోజులుగా కనిపించకుండా పోయాడు.
రామాయంపేట పోలీసుల కథనం ప్రకారం యూపీ రాష్ట్రానికి చెందిన సదరు వ్యాపారి గత నాలుగు సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం వచ్చి.. మరో ముగ్గురితో కలిసి రామాయంపేట కేంద్రంగా చేసుకుని బట్టల వ్యాపారం చేస్తున్నాడు.
అయితే బాబుల్ సింగ్ బట్టలు మూట కట్టుకుని గత మూడు రోజుల క్రితం బైక్పై బయలు దేరాడని తోటి వ్యక్తులు తెలిపారు. మూడు రోజులైనా బాబుల్ సింగ్ తాము ఉండే చోటికి తిరిగి రాకపోవడంతో వారు ఆదివారం రాత్రి రామాయంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాబుల్ సింగ్ స్నేహితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై బాలరాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Prayag ManZhi | తనపై కోటి రూపాయల రివార్డ్ ఉన్న మావోయిస్టు మాంఝీ ఎన్కౌంటర్లో మృతి
Road Accident | నెలాఖరులో పదవీ విరమణ..అంతలోనే రోడ్డుప్రమాదం.. ఘటనలో హెడ్మాస్టర్ దుర్మరణం