జిన్నారం, జూలై 4: సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రామికవాడలోని ఐటీసీ పరిశ్రమలో జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం బీఆర్టీయూ గెలుపొందింది. మొత్తం 74 ఓట్లు పోలు కాగా, బీఆర్టీయూ నుంచి పోటీచేసిన సాంబశివరావుకు 37 ఓట్లు, ఐఎన్టీయూసీ అభ్యర్థి చంద్రశేఖర్‌కు 36 ఓట్లు వచ్చాయి. బీఆర్టీయూ విజయం సాధించడంతో శుక్రవారం పరిశ్రమ వద్ద కార్మికులు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు.
అనంత రం సాంబశివరావు మాట్లాడుతూ… ఈ విజ యం కార్మికులకు అంకితమన్నారు. గత వేత న ఒప్పందంలో యాజమాన్యానికి కొమ్ము కాసిన ఐఎన్టీయూసీ యూనియన్ ఎన్నికల్లో పత్తా లేకుండా పోయిందన్నారు. కార్మికులకు జరిగిన అన్యాయాన్ని వారు ఓటుతో జవాబు చెప్పారన్నారు. కార్మిక సంక్షేమానికి బీఆర్టీయూ కృషిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.