సదాశివపేట, డిసెంబర్ 2: బీఆర్ఎస్ గురుకుల బాటలో భాగంగా సోమవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని మైనార్టీ బాలుర హాస్టల్‌ను బీఆర్ఎస్వీ నాయకులు సందర్శించారు. హాస్టల్ పరిసరాలను పరిశీలిం చి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి పెద్దగొల్ల శ్రీహరి మాట్లాడుతూ హాస్టల్లో టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
విద్యార్థులకు అందించే భోజనంలో కుళ్లిపోయిన టమాటాలు వాడుతున్నారని ఆరోపించారు. తాగునీరు, స్నానాలు చేసే దగ్గర పాచి పట్టిన గోడలు దర్శనమిస్తున్నాయన్నారు. సొంత భవనం ఉన్నా అద్దె భవనంలోనే హాస్టల్ కొనసాగుతున్నదని విమర్శించారు. హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్వీ మండల, పట్టణ అధ్యక్షులు పాండునాయక్, రోషన్, నాయకులు అక్షయ్, తరుణ్, నాజర్, నవీన్ పాల్గొన్నారు.