నంగునూరు, సెప్టెంబర్ 16: సీఎం రేవంత్‌రెడ్డి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కొం తకాలంగా బహిరంగ సభల్లో, ప్రెస్మీట్లలో, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలపై అసభ్యపదజాలంతో మాట్లాడడం సిగ్గుచేటని సిద్దిపేట జిల్లా నంగునూరు మండల బీఆర్ఎస్ యు వజన నాయకులు విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ సం స్కృతి, సంప్రదాయాలకు భిన్నంగా అంతు చూస్తాం, మగాడివి అయితే రా చూసుకుం దాం, నన్ను ముట్టుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు మానవబాంబులై మీ అంతు చూస్తారు అనడం సరికాదన్నారు. లాగులో తొండలు చొర్రిస్తాం, పేగులు మెడలో వేసుకుంటాం బిడ్డ, మీ గుడ్లు పీకి గోలీలు ఆడుకుంటాం అని సీఎం రేవంత్ మాట్లాడుతున్నారన్నారు. ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన మీటింగ్‌లో సంకనాకనికి పోయిండ్రా అంటూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అనడంపై మండిపడ్డా రు.
మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుపై వ్యక్తిగతంగా మాట్లాడడం వల్ల బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటల వల్ల యువకులు, విధ్యార్థులు ప్రేరేపితమై అవాంఛనీయ సంఘటనలు జరిగే ప్రమాదం ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే భాష మార్చుకోవాలని, తాను మాట్లాడిన మాటలను వెనకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమం లో బీఆర్ఎస్ నాయకులు ఆకుబత్తిని రాము, అనగోని పరశురాములు, తప్పెట పరశురాములు, చింటూ, ఇమ్రాన్, అనిల్‌రెడ్డి, పరశురాములు, కాటం రాజు, నరేశ్, బాలరాజు, హరిబాబు, రాజు పాల్గొన్నారు.
చిన్నకోడూరు, సెప్టెంబర్ 16: మాజీమంత్రి, సిద్దిపేట శాసన సభ్యుడు తన్నీరు హరీశ్‌రావుపై గాంధీ భవన్లో అనుచిత వాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చిన్నకోడూరు ఎస్ఐ బాలకృష్ణకు బీఆర్ఎస్ మండల యువజన విభాగం అధ్యక్షుడు గుండెల్లి వేణు, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు గుజ్జ రాజు ఆధ్వర్యంలో సోమవారం ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభలు, సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై అసభ్య పదజాలంతో మాట్లాడటం తెలంగాణ సంప్రదాయాలకు భిన్నమని హెచ్చరించారు. కార్యక్రమంలో మిట్టపల్లి సుధాకర్, పడిగే లింగం, మన్నే ఆనంద్, భానుచందర్, రాజశేఖర్ రెడ్డి, శ్రీకాంత్, ప్రేమ్, జగన్ తదితరులు ఉన్నారు.