మెదక్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురసరించుకుని, సీఎం కేసీఆర్ ఆదేశానుసారం మంగళవారం మెదక్ నియోజకవర్గ ప్రతినిధుల సభ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. ప్రతిఒకరూ తమ గ్రామాల్లో ఉదయం 9.00 గంటలకల్లా జెండా ఆవిషరణ ముగించుకుని, మెదక్‌లోని వెస్లీ కాలేజ్ గ్రౌండ్, మెదక్ చర్చి కాంపౌండ్, గోల్ బంగ్లా వద్ద నిర్వహించే బీఆర్ఎస్ ప్రతినిధుల సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
సభలో సంక్షేమ పథకాలను వివరిస్తాం: ఇఫో డైరెక్టర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతినిధుల సభలో వివరిస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఇఫో డైరెక్టర్ ఎం.దేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నేతృత్వంలో పట్టణంలోని చర్చి గ్రౌండ్ గోల్ బంగ్లా వద్ద నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభలో 12 తీర్మానాలు ప్రవేశ పెడుతున్నామన్నారు. సమావేశంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, ఏడు పాయల చైర్మన్ బాలాగౌడ్, ఆత్మ చైర్మన్ అంజగౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, పాపన్నపేట మారెట్ కమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, పార్టీ పాపన్నపేట మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్ పాల్గొన్నారు.
చిన్నశంకరంపేట
చిన్నశంకరంపేట, ఏప్రిల్ 24: మెదక్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని జడ్పీటీసీ పట్లోరి మాధవి కోరారు.
మనోహరాబాద్
మనోహరాబాద్, ఏప్రిల్ 24: మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మండలంలోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని పార్టీ మండల అధ్యక్షుడు పురం మహేశ్ ముదిరాజ్ కోరారు. మండలం దండుపల్లిలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మంగళవారం నిర్వహించనున్న జెండా పండుగలో పాల్గొనాలన్నారు. ఆయనతో పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, సర్పంచ్ అర్జున్, నాయకులు చంద్రశేఖర్ ముదిరాజ్, పంజా భిక్షపతి, ఇర్ఫాన్, బాలరాజు పాల్గొన్నారు.
చేగుంట
చేగుంట, ఏప్రిల్ 24: మెదక్‌లో నిర్వహించే బీఆర్ఎస్ సమావేశాన్ని విజయవంతం చేయాలని నార్సింగి వైస్ ఎంపీపీ దొబ్బల సుజాతా శంకర్ అన్నారు. మండలంలోని జెప్తిశివునూర్, సంకాపూర్, సంకాపూర్ తండా, శేరిపల్లి గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖల అధ్యక్షుల ఆధ్వర్యంలో గ్రామాల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలన్నారు. మెదక్, దుబ్బాకలో నిర్వహించే బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేసేందుకు చేగుంట, నార్సింగి మండలలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యక్తలు తరలిరావాలన్నారు.