జహీరాబాద్, డిసెంబర్ 10: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వీరాభిమాని, హీరో రాకింగ్ రాకేశ్ తీసిన కేసీఆర్(కేశవ చంద్ర రమావత్) సినిమాను జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తిలకించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ఆధ్వర్యంలో పట్టణంలోని సినీమ్యాక్స్ థియేటర్లో మంగళవారం మార్నింగ్ షో నిర్వహించారు. నియోజకవర్గంలోని న్యాల్కల్, కోహీర్, జహీరాబాద్, ఝరాసంగం, మొగుడంపల్లి మండలాలకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో వచ్చి కేసీఆర్ సినిమాను తిలకించి జై కేసీఆర్.. జై తెలంగాణ అంటూ నినదించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై రాకింగ్ రాకేశ్ తీసిన సినిమా చరిత్రలో నిలిచిపోతుందని బీఆర్ఎస్ నేతలు తట్టు నారాయణ, నామ రవికిరణ్ అన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.