న్యాల్కల్, మే 3: గెలుపు కోసం కాంగ్రెస్ మరోసారి మాయ మాటలతో ప్రజలను మోసం చేసేందుకు వస్తుందని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్త దేవీశ్రీప్రసాద్ అన్నారు. శుక్రవారం న్యాల్కల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌కు మద్దతుగా భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయడంతో విఫలమైందన్నారు. ప్రజలు, రైతులకు మోసం చేసేందుకు పార్లమెంట్ ఎన్నికలను అడ్డుపెట్డుకుని బూటకపు గ్యారెంటీలతో మళ్లీ ప్రజల్లోకి వస్తున్న కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారన్నారు. రైతులకు ఇస్తామన్న రైతుబంధు కింద రూ.15వేలు నేటికీ అమలు చేయలేదన్నారు. గతంలోని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన రూ.10వేలు కూడా అందించలేదన్నారు. పంట అమ్ముకోవడానికి రైతలకు ఎలాంటి భరోసా కల్పించడం లేదని ఆరోపించారు.
మహిళలకు ఇస్తామన్న రూ.2500, కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం పత్తాలేకుండా పొయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణలో కరువుఛాయలు అలుముకొన్నాయని, తాగు, సాగునీరు, విద్యత్ తదితర సమస్యలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పదేండ్ల బీజేపీ పాలనను ప్రజలు చూశారని, ఆ పార్టీతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. ఈ ఎన్నికల్లో గాలి అనిల్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ మట్లాడుతూ పేదలకు సేవ చేసే అవకాశమిచ్చి ఆశీర్వాదించాలని కోరారు. రోడ్‌షోకు గ్రామాల నుంచి ప్రత్యేక వాహనాలు, బైక్‌లపై భారీఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్, నాయకులు నర్సింహారెడ్డి, భాస్కర్, సంగ్రాంపాటిల్, ఎంఆర్ ప్రవీణ్‌కుమార్, రాజేందర్‌రెడ్డి, భూమారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, అశోక్, రవికుమార్, మారుతీయాదవ్, మల్లారెడ్డి, కుతుబొద్దీన్, నిరంజన్‌రెడ్డి, తుక్కారెడ్డి, అప్పారావుపాటిల్, మహేశ్, బక్కారెడ్డి, శివస్వామి, ఇసాంపటేల్ పాల్గొన్నారు.