ఆడబిడ్డగా మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తా. ప్రజల మధ్య ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేశా. బీఆర్ఎస్కు ఓటేస్తే తెల్లరేషన్ కార్డున్న వారందరికీ సన్నబియ్యం సరఫరా చేస్తాం. రుణమాఫీ, రైతుబంధును అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో బొందపెట్టాలి అని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చిన్నశంకరంపేట మండలంలోని గవ్వలపల్లి గిరిజన తండా, కొర్విపల్లితండా, బంటికుంట, గిరిజన తండా, పేటగడ్డ ధర్పల్లి, అగ్రహారం గవ్వలపల్లి, కొర్విపల్లి గ్రామాల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామగ్రామాన ప్రజలు పద్మాదేవేందర్‌రెడ్డికి బ్రహ్మరథం పట్టారు.
చిన్నశంకరంపేట, నవంబర్ 24: రుణమాఫీ, రైతుబంధును అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో బొందపెట్టాలని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం చిన్నశంకరంపేట మండలంలోని గవ్వలపల్లి గిరిజన తండా, కొర్విపల్లితండా, బంటికుంట, గిరిజన తండా, పేటగడ్డ దర్పల్లి, అగ్రహారం గవ్వలపల్లి, కొర్విపల్లి గ్రామాల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామగ్రామాన ప్రజలు పద్మాదేవేందర్‌రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. డప్పుచప్పుల్లతో మంగళహారతులతో పూల వర్షం కురిపించారు. పటాకులు కాలుస్తూ బొట్టు పెట్టి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ 24 గంటల కరెంటు అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారో.. 3 గంటల కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్‌కు ఓటేస్తారో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆలోచించి ఓటు వేయండి ఆగం కావద్దన్నారు. 11 సార్లు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా నిలిపారన్నారు.
గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులకు ఉచిత కరెంటు రైతుబీమా, రైతుబంధు లాంటి పథకాలను ఎందు కు అందించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు విని ప్రజలు మోసపోవద్దన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి హన్మంతరావు మెదక్ ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. 13 ఏండ్ల నుంచి మెదక్ ప్రజలకు దూరం ఉండి ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు అడుగుతే ప్రజలు ఎలా వేస్తారన్నారు. ఆడబిడ్డగా మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ప్రజల మధ్య ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేశానని తెలిపారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే తెల్లరేషన్ కార్డు కలిగిన వారందరికీ అన్నపూర్ణ పథకం ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తామన్నారు. అసైన్డ్ భూములకు పట్టాలిచ్చి సర్వ హక్కులను కల్పిస్తామన్నారు. తెల్లరేషన్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ రూ. 5 లక్షల కేసీఆర్ బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. ఆసరా పింఛన్లు 2024 నుంచి రూ.5016కు పెంచనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి మహిళకు సౌభాగ్యలక్ష్మీ పథకం ద్వారా నెలకు రూ.3000 లు, రూ.400 రూపాయలకే గ్యాస్ సిలిండర్‌ను అందించనున్నట్లు తెలిపారు.
మహిళా సంఘాలకు సొంత భవనాలను నిర్మించి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ ఆరోగ్య రక్ష పథకం ద్వారా ఆర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.15 లక్షల ఆరోగ్య బీమాను అందించనున్నామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏకే గంగాధర్‌రావు, మ్యాడం బాలకృష్ణ, జడ్పీటీసీ పట్లోరి మాధవి, రైతుబంధు మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ పీహెచ్ రమణ, బీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు రాజు, వైస్ ఎంపీపీ సత్యనారాయణగౌడ్, సర్పంచ్‌లు గోపాల్‌నాయక్ సిద్దిరాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, దయానంద్ యాదవ్, ఎంపీటీసీలు రాణమ్మ, శివకుమార్, ప్రసాద్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మన్లు శ్రీనివాస్‌రెడ్డి, సత్యనారాయణ మాజీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, నాయకులు ప్రభాకర్, సుధాకర్ నాయక్, మైపాల్‌రెడ్డి, ఉప్పశ్రీను, తిరుపతి రెడ్డి, హేమవెంకటేశం, మండలంలోని వివిధ గ్రామా ల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సింగిల్‌విండో చైర్మన్లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.