MLA Kotha Prabhaker Reddy | రాయపోల్, జూలై 04 : ప్రతిభ కలిగిన క్రీడాకారులకు తగిన ప్రోత్సహం కల్పిస్తామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి శుక్రవారం దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట గ్రామంలో చాముండేశ్వరి గురుదత్త పీఠం కొడకండ్ల శ్రీరామ చరణ్ శర్మ గురూజీ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా దుబ్బాక నియోజకవర్గ స్ధాయి క్రికెట్ టోర్ని నిర్వహించారు. ఈ క్రీడలో ప్రథమ బహుమతి దొమ్మాట జట్టుకు రూ.20వేలు అందించారు. అలాగే ద్వితీయ బహుమతి దుబ్బాక జట్టుకు రూ.10వేల నగదుతో పాటు మెమెంటోలను అందించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది యవ క్రీడాకారులు వివిధ క్రీడల్లో నైపుణ్యం కలిగి ఉన్నారని వారికి తగిన ప్రోత్సహం లేకపోవడం వలన క్రీడల్లో రాణించడం లేకపోతున్నారని, గ్రామాలోల క్రీడలకు పెద్దపీట వేయాడానికి తాను తీవ్రంగా కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక ముందు కూడా క్రీడలకు తాను గ్రామాల్లో పేద్ద పీట వేసి వారిలో దాగి ఉన్న నైపుణ్యని వెలికితీసి మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్ధాయిలో రాణించేందుకు తన వంతు బాధ్యతగా అండగా ఉంటామన్నారు.
కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ పూజిత వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ సమన్వయకర్త రణం శ్రీనివాస్‌గౌడ్, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సర్వుగారి యాదవరెడ్డి, మాజీ కో అప్షెన్ సభ్యులు హైమద్, నియోజకవర్గ సీనియర్ బీఆర్ఎస్ నాయకులు తొగ కమలాకర్‌రెడ్డి, వల్లాల సత్యనారాయణ, బాల మల్లేశంగౌడ్, సీంహాచల, వంచ జనార్ధన్‌రెడ్డి, ఇప్ప దయాకర్, కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.