సిద్దిపేట, నవంబర్ 24: సిద్దిపేట జిల్లా కొండపాక వాస్తవ్యులు అప్పటి దొమ్మాట (ప్రస్తుతం దుబ్బాక) నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మృతి పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సంతాపం వ్యక్తం చేశారు.. 1983-88లో అప్పటి దొమ్మాట నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారని, తన సేవలు నేటితరం రాజకీయ నాయకలకు ఎంతో స్ఫూర్తి అని కొనియాడారు, ఎమ్మెల్యే అయినా తన తుదిశ్వాస వరకు సాధారణ జీవితాన్ని గడిపారని, ప్రజాసేవకు పరితపించారని, తన సేవలు నియోజకవర్గ ప్రజల్లో చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
చిన్నకోడూరు మండలం గోనేపల్లికి చెందిన విశ్రాంత గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కూర రవీందర్‌రెడ్డి మృతికి మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సంతాపం ప్రకటించారు. రాష్ట్ర ప్రిన్సిపాల్స్ సంఘం అధ్యక్షుడిగా, ఉపాధ్యాయుడిగా రవీందర్‌రెడ్డి ఎనలేని సేవలు ఆందించారన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.