రామాయంపేట, మార్చి 30: బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని రామాయంపేటలో ఆదివారం నిర్వహించనున్నట్లు మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు నాగరాజు, పురపాలిక చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి తెలిపారు. శనివారం రామాయంపేటలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
సమావేశానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. సమావేశానికి పార్టీ నాయకులతో పాటు బీఆర్ఎస్ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, పీఏసీఎస్ చైర్మన్లు హాజరుకావాలని కోరారు.