టేక్మాల్, జూన్ 1: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును ఆయన నివాసంలో బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు కలిశారు. ఈ నెల 3వ తేదీన హరీశ్‌రావు బర్త్‌డే సందర్భంగా ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అజ్మీర్ షరీఫ్ దర్గాలో సమర్పించే చాదర్‌ను అందజేశారు.
ఈ చాదర్‌ను హరీశ్‌రావు పుట్టినరోజు సందర్భంగా అజ్మీర్ షరీఫ్ దర్గాలో సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ పైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్, జహీరాబాద్ ఇన్చార్జి షేక్ ఫరీద్, సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి హకీం, నాయకులు జమ్ముఖాన్, అక్బర్, మెరాజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.