రామచంద్రాపురం, జూన్ 9: బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును పటాన్చెరు నియోజకవర్గంలో పెద్దఎత్తున చేపట్టాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వెన్నవరం ఆదర్శ్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లోని లక్ష్మీగార్డెన్స్‌లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియ గురించి బీఆర్ఎస్ శ్రేణులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సభ్య త్వ నమోదు చేయించాలన్నారు. డిజిటల్ సభ్య త్వ నమోదు కార్యక్రమాలను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి కూడా ఈసభ్యత్వ నమోదు ఉపయోగపడుతుందన్నారు.
పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని ఆయన సూచించారు. మాజీ కార్పొరేటర్ అంజయ్య, బీఆర్ఎస్ నాయకులు కుమార్‌గౌడ్, జగన్నాథ్‌రెడ్డి, పరమేశ్, గోవింద్, విష్ణువర్ధన్‌రెడ్డి, గఫార్, శ్రీను, బూన్, బేకు యాదయ్య, రమే శ్, రవితేజ, జంగయ్య, భాస్కర్, రాములు పాల్గొన్నారు.